Andhra Pradesh: పొలంబడి కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారి

మండలంలోని వల్లూరులో ఎంపిక చేయబడిన రైతులకు వ్యవసాయ శాఖ అధికారి డి.హరి కరుణాకర్ రెడ్డి పొలంబడి కార్యక్రమం నిర్వహించారు.

S. Srikanth
Published on: 22 Jan 2020 10:42 AM IST
Andhra Pradesh: పొలంబడి కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారి
X

ముత్తుకూరు: మండలంలోని వల్లూరులో ఎంపిక చేయబడిన రైతులకు వ్యవసాయ శాఖ అధికారి డి.హరి కరుణాకర్ రెడ్డి పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. పొలాల్లో వరి పైరును రైతులతో కలిసి పరిశీలించారు. అగ్గి తెగులును గుర్తించి నివారణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు, పిచికారీ చేయవలసిన మందును గురించి వివరించారు. యూరియా వాడకం తగ్గించాలని రైతులకు సూచించారు.

అనంతరం వైఎస్ ఆర్ రైతు భరోసా కు సంబంధించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సందేశం పత్రాలను ఎంఏఓ హరికరుణాకర్ రెడ్డి లబ్దిదారులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు ఎన్.మస్తానమ్మ, కృష్ణపట్నం పిఏసిఎస్ అధ్యక్షులు కందులూరు వెంకట రామిరెడ్డి, చెంగారెడ్డి, వాలంటీర్లు, రైతులు పాల్గొన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story