ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుపై రాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు

ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుపై రాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు
x
Highlights

Advocate lakshminarayana complains on mlc pandula ravindra babu: వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు వివాదంలో చిక్కుకున్నారు. న్యాయస్థానాల...

Advocate lakshminarayana complains on mlc pandula ravindra babu: వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు వివాదంలో చిక్కుకున్నారు. న్యాయస్థానాల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ హైకోర్టుకు, రాష్ట్రపతి, గవర్నర్‌కు న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ వెంట్రుకను కూడా ఎవరూ తాకలేరని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ఈ సందర్భంగా కోర్టులు, జడ్జిలు కూడా జగన్ ను ఏమీ చేయలేరని అన్నారు. ఈ నేపథ్యంలో కోర్టును, జడ్జిలను, లాయర్లను ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్రపతి, గవర్నర్ లకు మెయిల్ ద్వారా న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. రవీంద్రబాబును ఎమ్మెల్సీగా అనర్హుడిగా ప్రకటించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. నేరుగా ఫిర్యాదు చేసేందుకు లక్ష్మీనారాయణ గవర్నర్‌ అనుమతి కోరారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లక్ష్మీనారాయణ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. రవీంద్రబాబుపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.


Show Full Article
Print Article
Next Story
More Stories