ఎమ్మెల్సీ అభ్యర్ధి పెన్మత్స సురేష్‌బాబుకు బీ ఫారమ్‌ అందజేసిన సీఎం జగన్‌

ఎమ్మెల్సీ అభ్యర్ధి పెన్మత్స సురేష్‌బాబుకు బీ ఫారమ్‌ అందజేసిన సీఎం జగన్‌
x
Highlights

cm jagan handed bform to penmatsa sureshbabu: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి డాక్టర్‌ పెన్మత్స సూర్యనారాయణ రాజు(సురేష్‌ బాబు)కు క్యాంపు కార్యాలయంలో బీ ఫారమ్‌ సీఎం వైయస్‌. జగన్ అందజేశారు.

cm jagan handed bform to penmatsa sureshbabu: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి డాక్టర్‌ పెన్మత్స సూర్యనారాయణ రాజు(సురేష్‌ బాబు)కు క్యాంపు కార్యాలయంలో బీ ఫారమ్‌ సీఎం వైయస్‌. జగన్ అందజేశారు. ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ ఏర్ప‌డింది. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, దివంగ‌త పెన్మత్స సాంబ‌శివ‌రాజు కుమారుడు సురేష్‌బాబును అభ్య‌ర్థిగా దించారు.

సురేష్‌బాబు వెంట మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, వైసీపీ విజయనగరం జిల్లా రాజకీయవ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఉన్నారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఇంత త్వరగా టిక్కెట్‌ ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories