ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు క్షేమం- మంత్రి ఆదిమూలపు

Adimulapu Suresh: ఉక్రెయిన్‌లో ఉన్న కొందరు విద్యార్థులతో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడారు.

Arun Chilukuri
Published on: 24 Feb 2022 6:38 PM IST
Adimulapu Suresh Says Telugu Students Safe in Ukraine
X

ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు క్షేమం- మంత్రి ఆదిమూలపు

Adimulapu Suresh: ఉక్రెయిన్‌లో ఉన్న కొందరు విద్యార్థులతో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు విద్యార్థులు క్షేమంగానే ఉన్నారన్నారు. తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. సీఎం జగన్‌ కేంద్రమంత్రికి లేఖ రాశారని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం విద్యార్థులను రప్పించేందుకు ప్రయత్నిస్తోందని ప్రస్తుతం ఉక్రెయిన్‌లో విమాన సర్వీస్‌లు రద్దయ్యాయని చెప్పారు మంత్రి ఆదిమూలపు సురేష్.

విద్యార్థులకు సహాయం కోసం నోడల్ అధికారి, స్పెషల్ ఆఫీసర్‌ను నియమించామన్నారు. ఏపీ భవన్‌లో అధికారులను అప్రమత్తం చేశామన్నారు మంత్రి ఆదిమూలపు. పరిస్థితులు అనుకూలించగానే.. విద్యార్థులను స్వస్థలాలకు రప్పిస్తామన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story