Tadepalle: సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించిన ఏబీవీపీ.. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం

Tadepalle: మినీ డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ డిమాండ్‌తో ఆందోళన

Shekhar G
Published on: 13 Feb 2024 3:34 PM IST
ABVP Protest at CM Jagan Residence in Tadepalli
X

Tadepalle: సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించిన ఏబీవీపీ.. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం

Tadepalle: తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసాన్ని ఏబీవీపీ విద్యార్థి నాయకులు ముట్టడించారు. మినీ డీఎస్సీలు వద్దు మెగా డీఎస్సీ ముద్దు అనే నినాదంతో ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమీపంలోని పెట్రోల్ బంక్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్‌కు విద్యార్థి సంఘం నాయకులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు.

అక్కడ జరిగిన తోపులాటలో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశారంటూ నినాదాలు చేశారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న ప్రభుత్వ హామీ ఎక్కడ అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేస్తోన్న విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Shekhar G

Shekhar G

Next Story