Srisailam: శ్రీశైలం ఆలయం క్యూలైన్‌లో పునుగు పిల్లి సందడి..

Srisailam: చాలా రోజుల తరువాత పునుగుపిల్లి సందడి చేసిందంటున్న భక్తులు

Shekhar G
Published on: 24 July 2023 2:15 PM IST
A Viverra Cat In The Queue Line Of The Srisailam Temple
X

Srisailam: శ్రీశైలం ఆలయం క్యూలైన్‌లో పునుగు పిల్లి సందడి..   

Srisailam: శ్రీశైలం ఆలయం క్యూలైన్ లో పునుగు పిల్లి సందడి చేసింది. శ్రీస్వామి అమ్మవారి ఉచిత దర్శనానికి వెళ్లే క్యూలైన్ లో భక్తులకు పునుగుపిల్లి కనిపించింది. భక్తులు తమ తమ సెల్ ఫోన్లతో పునుగుపిల్లి దృశ్యాలను చిత్రీకరించారు. గతంలో క్యూలైన్ ఏర్పాటుకు ముందు ఈప్రాంతంలో ఎక్కువగా పునుగు పిల్లుల సందడి చేసేవని స్థానికులు చెబుతున్నారు. క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పునుగు పిల్లుల జాడ తగ్గిందని స్థానికులంటున్నారు.

Shekhar G

Shekhar G

Next Story