Chittoor: చిత్తూరు జిల్లాలో వింత ఆచారం.. జల్లికట్టును తలపించేలా కుక్కల పోటీ
Chittoor: తమిళనాడు నుంచి కూడా వచ్చిన కుక్కల యజమానులు
Chittoor: చిత్తూరు జిల్లాలో వింత ఆచారం.. జల్లికట్టును తలపించేలా కుక్కల పోటీ
Chittoor: సాధారణంగా పండుగ సమయాల్లో ఉల్లాసం కోసం కోడిపందేలు, ఎద్దుల పందేలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ పోటీల్లో గెలుపొందిన వాటికి భారీ మొత్తంలో బహుమతులు సైతం ప్రకటిస్తుంటారు.. వివిధ రాష్ట్రాల్లో కోడిపందేలు, ఎద్దుల పోటీల కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ సైతం ఇచ్చి వాటిని పోటీకు సిద్ధం చేసే విషయం అందరికి తెలుసు. ఇక చిత్తూరు జిల్లాల్లో తమిళనాడు సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ నాడు ఘనంగా జల్లికట్టును నిర్వహిస్తారు. అయితే చిత్తూరు జిల్లాలో కుక్కల పోటీలను నిర్వహిస్తున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, చిన్నారి దొడ్డి గ్రామంలో వింత ఆచారం ఉంది. ఇక్కడ కుక్కల పందేలను నిర్వహిస్తారు. చిన్నారిదొడ్డి గ్రామంలో నిర్వహించిన కుక్కల పోటీలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండే కాకుండా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కుక్కల యజమానుకు తమ కుక్కలను తీసుకుని వచ్చి పోటీల్లో దింపారు.. ఈ పోటీలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ పోటీల్లో మొత్తం ఇరవై బహుమతులను పోటీల్లో గెలుపొందిన కుక్కల యజమానులకు అందించారు..


