Chandrababu: చంద్రబాబు నివాసంలో కూటమి నేతల సమావేశం

Chandrababu: హాజరైన పురందేశ్వరి, సిద్ధార్థసింగ్, పవన్‌ కల్యాణ్

Jyothi
Published on: 12 April 2024 1:43 PM IST
A Meeting of Alliance Leaders at Chandrababu House
X

Chandrababu: చంద్రబాబు నివాసంలో కూటమి నేతల సమావేశం

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కూటమి నేతలు సమావేశమయ్యారు. బీజేపీ నేతలు పురందేశ్వరి, సిద్దార్థ నాథ్ సింగ్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఈ భేటీకి హాజరయ్యారు. సీట్ల ప్రకటన తర్వాత అభ్యర్థుల మధ్య నెలకొన్న విబేధాలు, మూడు పార్టీల నేతల మధ్య సమన్వయం, ప్రచారంపై చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టో రూపకల్పనపై కూడా మూడు పార్టీల నేతలు చర్చించనున్నారు. అటు ఇప్పటికే కొన్ని ప్రకటించిన అభ్యర్థుల మార్పులపై కూడా చర్చించే అవకాశం ఉంది.

Jyothi

Jyothi

Next Story