Kurnool: కర్నూలు జిల్లా నంచర్ల రైల్వేస్టేషన్‌లో గూడ్స్‌ బోగీలో మంటలు

Kurnool: రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చిన గూడ్స్ గార్డ్

Shashank Gullapelli
Updated on: 29 April 2024 9:00 PM IST
A Fire Broke Out In A Goods Bogie At Nancherla Railway Station In Kurnool District
X

Kurnool: కర్నూలు జిల్లా నంచర్ల రైల్వేస్టేషన్‌లో గూడ్స్‌ బోగీలో మంటలు

Kurnool: కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నంచర్ల రైల్వేస్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ బోగీలో మంటలు చెలరేగాయి. వేగంగా వెళ్తున్న గూడ్స్‌ బోగీలో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన గూడ్స్‌ గార్డ్.. గుంతకల్లు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. బొగ్గు లోడ్‌తో కోయంబత్తూరుకు వెళ్తున్న గూడ్స్‌రైలు. ఎండ తీవ్రతకు బోగీలో ఉన్న బొగ్గుకు నిప్పంటుకుందా.. లేదా ప్రమాదం జరిగిందా అన్న కోణంలో విచారిస్తున్నారు. ప్రస్తుతం నంచర్ల- మొలగవల్లి రైల్వేస్టేషన్‌ల మధ్య పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story