Anantapur: డిప్యూటీ ఎమ్మార్వో ఛాంబర్‌లో వీఆర్‌ఏల ఆందోళన

Anantapur: మానసికంగా వేధిస్తున్నారని నిరసనకు దిగిన వీఆర్ఏలు

Shekhar G
Updated on: 4 Feb 2024 7:15 PM IST
A Concern of VRO In The Deputy MRO Chamber
X

Anantapur: డిప్యూటీ ఎమ్మార్వో ఛాంబర్‌లో వీఆర్‌ఏల ఆందోళన

Anantapur: అనంతపురం జిల్లా ధర్మవరం డిప్యూటీ తహశీల్దార్‌పై వీఆర్ఏలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం వడ్డించలేదన్న కారణంతో ఓ వీఆర్ఏను పరుష పదజాలతో దూషించాడని ఆరోపించారు వీఆర్ఏలు. దీంతో డిప్యూటీ ఎమ్మార్వో ఛాంబర్‌లోకి వెళ్లి ఈశ్వరయ్యను నిలదీశారు. తోటి ఉద్యోగిని బూతులు తిట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పనుల కోసం వీఆర్ఏలను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. డిప్యూటీ ఎమ్మార్వో చెప్పిన పనులు చేస్తున్నా కూడా బూతులు తిడుతూ.. మానసికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు వీఆర్ఏలు. డిప్యూటీ తహశీల్దార్‌తో వాదనకు దిగిన వీఆర్‌ఏల వీడియో వైరల్ అవుతోంది.

Shekhar G

Shekhar G

Next Story