Chittoor: బొమ్మ తుపాకీ అంటూ హేళన చేసిన స్నేహితులు.. కాల్చి చూపించిన మాజీ జవాను..

Chittoor: చిత్తూరు పట్టణంలోని ఓ బార్‌లో కాల్పుల కలకలం

Jyothi
Published on: 1 Feb 2024 11:23 AM IST
A Bar in Chittoor Town was Fired upon
X

Chittoor: బొమ్మ తుపాకీ అంటూ హేళన చేసిన స్నేహితులు.. కాల్చి చూపించిన మాజీ జవాను..

Chittoor: చిత్తూరు పట్టణంలోని ఓ బార్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. మద్యం మత్తులో స్నేహితులు బొమ్మ తుపాకీ అంటూ హేళన చేశారు. దీంతో బొమ్మ తుపాకీ కాదంటూ నేలకు గురి పెట్టి మాజీ జవాన్‌ కాల్పులు జరిపారు. చుట్టూ ఉన్న వాళ్లంతా భయపడిపోగా.. నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

స్థానికుల సమచారంతో నిందితుడు రిటైర్డ్‌ జవాన్‌ మల్లికార్జున్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కాల్పుల్లో ఎవరికి ఎలాంటి గాయం కాకపోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story