ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు!

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 57,752 కరోనా టెస్టులు చేయగా 733 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది

Krishna
Published on: 27 Nov 2020 7:12 PM IST
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు!
X

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 57,752 కరోనా టెస్టులు చేయగా 733 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,66,438 కి చేరుకుంది. అయితే ఇందులో 12,137 యాక్టివ్ కేసులుండగా 8,47,325 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,205 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 6 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6,976 కి చేరుకుంది.

కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, చిత్తూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, విజయనగరంలో ఒకరు కరోనాతో మరణించారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 40, చిత్తూరులో 74, ఈస్ట్ గోదావరిలో 65, గుంటూరులో 112, కడపలో 33, కృష్ణాలో 102, కర్నూల్ లో 21, నెల్లూరులో 29, ప్రకాశంలో 13, శ్రీకాకుళం 22, విశాఖపట్నం 73, విజయనగరం 31, వెస్ట్ గోదావరి 118 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఏపీలో 99,13,068 కరోనా టెస్టులు నిర్వహించారు.


Krishna

Krishna

Next Story