70 Members Fall Sick Consuming Beef: కలుషిత ఆహారం తిని 70 మంది అస్వస్థత

70 Members Fall Sick Consuming Beef: విశాఖ ఏజెన్సీలో చనిపోయిన ఆవు మాంసాన్ని తినటం వల్ల 70 మంది అస్వస్థతకు గురయ్యారు.

Raj
By Raj
Updated on: 9 July 2020 3:34 PM IST
70 Members Fall Sick Consuming Beef: కలుషిత ఆహారం తిని 70 మంది అస్వస్థత
X

70 Members Fall Sick Consuming Beef: విశాఖ ఏజెన్సీలో చనిపోయిన ఆవు మాంసాన్ని తినటం వల్ల 70 మంది అస్వస్థతకు గురయ్యారు. మాడుగుల మండలం గడుతురు పంచాయతీ పరిధిలోని మలకపాలెంలో ఈ ఘటన జరిగింది. అస్వస్థతకు గురైన వారిని స్థానికులు పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా సమాచారం. కాగా ఈనెల 6వ తేదీన మలకపాలెంలో లక్ష్మయ్య అనే వ్యక్తికి చెందిన ఆవు కొండప్రాంతంలో మరణించింది. అయితే మరుసటి రోజు ఆ ఆవు మృతదేహాన్ని గుర్తించి.. గ్రామానికి తీసుకువచ్చారు అనంతరం దాని మాంసాన్ని గ్రామస్థులంతా పంచుకున్నారు. ఆ రోజు రాత్రి మాంసాన్ని వండుకొని తినడం వలన కొంతమందికి వాంతులు, విరేచనాలు వచ్చాయి.

విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్‌ అప్పలస్వామి బుధవారం అర్ధరాత్రి సమయంలో గ్రామానికి చేరుకున్నారు. అస్వస్థతకు గురైన వారిని పరిశీలించి జి.మాడుగుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఇందులో పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురిని పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు వారి అస్వస్థతకు కారణం చనిపోయిన ఆవు మాంసాన్ని తినడమేనని వైద్యులు గుర్తించారు. బాధితులను పాడేరు ఎమ్మెల్యే కోటగోళి భాగ్యలక్ష్మి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వైద్యులతోను మాట్లాడిన ఎమ్మెల్యే పారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విషమంగా ఉన్నవారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె కోరారు.

Raj

Raj

Next Story