నూజివీడు క్వారంటైన్ సెంటర్ లో కరోనా కలకలం

K V D Varma
Updated on: 24 May 2020 10:14 PM IST
నూజివీడు క్వారంటైన్ సెంటర్ లో కరోనా కలకలం
X
Representational Image

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. లాక్ డౌన్ లాంటి విధానాలతో ప్రజా జీవనం అస్తవ్యస్తం అయింది. అయితే, ఇటీవల కాలంలో లాక్ డౌన్ విషయంలో కొన్ని సడలింపు లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో, రాష్ట్రప్రభుత్వాలు కూడా వాటిని అనుసరిస్తున్నాయి.

ఇందులో భాగంగా, విదేశాలలో చిక్కుకుపోయిన తెలుగు వారిని తిరిగి స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లను చేశాయి ప్రభుత్వాలు. దీంతో ప్రత్యెక విమానాల్లో విదేశాల నుంచి మనవారు విజయవాడకు చేరుకున్నారు. వారందర్నీ వేర్వేరు ప్రాంతాలలో క్వారంటైన్ లో ఉంచారు. ఇందులో నూజివీడులో కొంతమంది క్వారంటైన్ లో ఉన్నారు.

వీరిలో దుబాయ్ నుండి వచ్చి నూజివీడు ట్రిపుల్ ఐటీ క్వారన్ టెన్ లో ఉన్న 144 మందిలో 56 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. దీంతో వీరందర్నీ ప్రత్యేక వాహనాలలో వారిని విజయవాడ తరలిస్తున్నారు. ఈ విషయాన్ని నూజివీడు మండల తాసిల్దార్ ఎం సురేష్ కుమార్ తెలిపారు.

ర్యాపిడ్ కిట్లతో పరీక్షించినప్పుడు వీరికి కరోనా లక్షణాలు కనిపించాయని తాసిల్దార్ చెప్పారు. అయితే, వీఎరిని విజయవాడలో మరోసారి పరీక్షలు చేసి కరోనా నిర్ధారణ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం వీరికి కరోనా లక్షణాలు ఉన్నట్టు బయటపడిందనీ, విజయవాడలో పరీక్షల తరువాత ఈ విషయం ఖరారు అవుతుందనీ అయన వివరించారు.

వీరిని ఈనెల 21వ తేదీన నూజివీడు ట్రిపుల్ ఐటీ కి క్వారంటైన్ కోసం తెచ్చినట్లు చెప్పారు. వీరికి సమయానికి అల్పాహారము, భోజనము ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రెవెన్యూ శాఖ, వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారని చెప్పారు.

రైతులు, ప్రజలు ఏ విధమైన సమస్యలు ఉన్నప్పటికీ కార్యాలయానికి రాకుండా, ఫోను ద్వారా కానీ, ఆన్లైన్ విధానంలో కానీ సమస్యలను పరిష్కరించుకునే విధంగా ముందడుగు వేయాలని సూచించారు. ఇందుకోసం పూర్తి స్థాయిలో ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి, చేతులను క్రమం తప్పకుండా పరిశుభ్ర పరుచుకోవాలనీ ఈ సందర్భంగా తహశీల్దార్ సూచించారు.

K V D Varma

K V D Varma

Next Story