మెడ్ ప్లస్ ఫార్మసీకీ ఎంపికైన 36మంది శ్రీ ప్రకాష్ విద్యార్ధులు

మెడ్ ప్లస్ ఫార్మసీకీ ఎంపికైన 36మంది శ్రీ ప్రకాష్ విద్యార్ధులు
x
ప్రిన్సిపాల్ డా.కే వీర్రాజు, వైస్ ప్రిన్సిపాల్ పి.సుబ్బారావు
Highlights

పట్టణంలోని శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల స్పెసెస్ డిగ్రీ కాలేజ్ విద్యార్ధులు 36 మంది మెడ్ ప్లస్ ఫార్మసీకి ఎంపికయ్యారని ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డా.కే వీర్రాజు తెలిపారు.

పాయకరావుపేట: పట్టణంలోని శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల స్పెసెస్ డిగ్రీ కాలేజ్ విద్యార్ధులు 36 మంది మెడ్ ప్లస్ ఫార్మసీకి ఎంపికయ్యారని ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డా.కే వీర్రాజు తెలిపారు. హైర్ మీ సొల్యూషన్స్ సంస్థ ఆధ్వర్యంలో మెడ్ ప్లస్ వారిచే నిర్వహించిన ఆన్ క్యాంపస్ డ్రయివ్ నందు ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్న విద్యార్ధులు ఎంపికయ్యారన్నారు. డిగ్రీ పూర్తయిన తరువాత వీరంతా శిక్షణ పూర్తిచేసుకుని మెడ్ ప్లస్ ఫార్మసీల నందు ఫార్మసిస్ట్ లుగా , స్టోర్ ఇంచార్జ్ లుగా విధులలో చేరతారు.

ఈ డ్రైవ్ నందు హైర్ మీ నుండి ఏ.ప్రసన్న కుమార్, ఏ.పి హైర్ మీ ఏరియా సేల్స్ మేనేజర్, జి.గణేష్, టెక్నీకల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, పి.ధనుంజయ్, క్యాంపస్ రిలేషన్ మేనేజర్ మరియు మెడ్ ప్లస్ ఎగ్జిక్యూటివ్ హెచ్.ఆర్ సత్య శ్రీనివాస్ లు ఈ ఎంపిక ప్రక్రియ లో పాల్గొన్నారు. ఎంపికైన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సి.హెచ్ వి.కే. నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్, వైస్ ప్రిన్సిపాల్ పి.సుబ్బారావు దితరులు అభినందించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories