అసెంబ్లీలో నిలదీయడానికి టీడీపీకి 21 అంశాలు

అసెంబ్లీలో నిలదీయడానికి టీడీపీకి 21 అంశాలు
x
Highlights

ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి 21 అంశాలను తెలుగుదేశంపార్టీ ఎంపకి చేసుకుంది. అందులో ప్రధానంగా రుణమాఫీ అంశాన్ని లేవనెత్తాలని నిర్ణయించుకుంది. అలాగే బిసిలపై ప్రబుత్వం కక్ష సాదిస్తోందని ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని.. బీసీ మహిళలకు ఏటా రూ.15 వేల ఆర్థికసాయం ఎందుకు ఇవ్వట్లేదని అడగాలని నిర్ణయించుకున్నారు.

టీడీఎల్పీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టిడిపి జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం, అక్కడే చంద్రబాబు అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు.

ఉల్లి, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, తెదేపా శ్రేణులపై తప్పుడు కేసులు, ఇసుక కొరతతో భవననిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, రైతు రుణమాఫీ 4, 5 విడతలు ఎగ్గొట్టడం, గ్రామ సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ..

ఈ అంశాలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఉల్లితో పాటు, నిత్యావసర ధరల పెరుగుదలపై సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజే వాయిదా తీర్మానం ఇస్తున్నట్టు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులు తెలిపారు. కాగా టీడీఎల్పీ సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినట్టు సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories