Kuwait: కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు ఏపీ వాసులు మృతి

Kuwait: కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.

Arun Chilukuri
Published on: 14 Jun 2024 9:34 AM IST
2 AP Residents Killed in Kuwait Fire Incident
X

Kuwait: కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు ఏపీ వాసులు మృతి

Kuwait: కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన ఈశ్వరుడు అనే వ్యక్తులు ఉన్నట్లు ఏపీ నాన్ రెసిడెంట్ సొసైటీ తెలిపింది. కాగా ఇద్దరి మృతదేహాలు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి చేరుతాయని తెలిపింది. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

కాగా బుధవారం తెల్లవారుజామున కువైట్‌లోని మంగ్‌ఫలోని కార్మికులు ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 50 మంది మృతిచెందగా.. ఇందులో 45 మంది భారతీయులు ఉన్నారని కువైట్‌ అధికారులు ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story