ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు!

ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో 64,581 కరోనా టెస్టులు చేయగా 1,916 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి
ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో 64,581 కరోనా టెస్టులు చేయగా 1,916 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,27,882 కి చేరుకుంది. అయితే ఇందులో 22,538 యాక్టివ్ కేసులుండగా 7,98,625 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 3,033 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 13 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6,706కి చేరుకుంది.
అనంతపురం జిల్లాలో 3, కృష్ణా 3, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 106, చిత్తూరులో 121, ఈస్ట్ గోదావరిలో 354, గుంటూరులో 179, కడపలో 141, కృష్ణాలో 68, కర్నూల్ లో 22, నెల్లూరులో 93, ప్రకాశంలో 178, శ్రీకాకుళం 68, విశాఖపట్నం 105, విజయనగరం 55, వెస్ట్ గోదావరి 426 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఏపీలో 81,82,266 కరోనా టెస్టులు నిర్వహించారు.
#COVIDUpdates: 02/11/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 2, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,24,987 పాజిటివ్ కేసు లకు గాను
*7,95,730 మంది డిశ్చార్జ్ కాగా
*6,719 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 22,538#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/ShfesOLCGr