ఏపీలో తగ్గుతోన్న కరోనా రోగుల డెత్ రేట్

ఏపీలో తగ్గుతోన్న కరోనా రోగుల డెత్ రేట్
x
Highlights

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 77,148 కరోనా టెస్టులు చేయగా 1,728 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 77,148 కరోనా టెస్టులు చేయగా 1,728 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,49,705 కి చేరుకుంది. అయితే ఇందులో 20,857 యాక్టివ్ కేసులుండగా 8,22,011 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,777 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 9 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6837 కి చేరుకుంది.

కృష్ణాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. అలాగే, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు మృతిచెందారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 99, చిత్తూరులో 206, ఈస్ట్ గోదావరిలో 290, గుంటూరులో 212, కడపలో 85, కృష్ణాలో 223, కర్నూల్ లో 36, నెల్లూరులో 91, ప్రకాశంలో 88, శ్రీకాకుళం 43, విశాఖపట్నం 74, విజయనగరం 42, వెస్ట్ గోదావరి 239 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఏపీలో 89,40,488 కరోనా టెస్టులు నిర్వహించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories