ఏపీలో 90 లక్షలకు చేరిన కరోనా టెస్టులు!

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 80,737 కరోనా టెస్టులు చేయగా 1,593 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Krishna
Published on: 13 Nov 2020 6:33 PM IST
ఏపీలో 90 లక్షలకు చేరిన కరోనా టెస్టులు!
X

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 80,737 కరోనా టెస్టులు చేయగా 1,593 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,51,298 కి చేరుకుంది. అయితే ఇందులో 20,262 యాక్టివ్ కేసులుండగా 8,24,189 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 2,178 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 10 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6847 కి చేరుకుంది.

కృష్ణా జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, గుంటూరులో ఒకరు, నెల్లూరు ఒకరు, విజయనగరంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మరణించారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 105, చిత్తూరులో 225, ఈస్ట్ గోదావరిలో 259, గుంటూరులో 202, కడపలో 43, కృష్ణాలో 202, కర్నూల్ లో 45, నెల్లూరులో 93, ప్రకాశంలో 51, శ్రీకాకుళం 58, విశాఖపట్నం 80, విజయనగరం 42, వెస్ట్ గోదావరి 188 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఏపీలో 90,21,225 కరోనా టెస్టులు నిర్వహించారు.

Krishna

Krishna

Next Story