విశాఖలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో 11మందికి రిమాండ్

Visakha: జనవరి 12 వరకు రిమాండ్ విధించిన కోర్టు

Jyothi
Updated on: 3 Jan 2024 9:16 AM IST
11 Persons Remanded in Case of Rape of Minor Girl in Visakha
X

విశాఖలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో 11మందికి రిమాండ్ 

Visakha: మైనర్ దళిత బాలికపై అత్యాచారం కేసులో 11మందికి ఫస్ట్ ఏసీ. ఎంకోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. ఇద్దరు కీలక నిందితుల కోసం గాలింపు కొనసాగుతుంది. ఒడిషాకి చెందిన బాలికపై 13మంది అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. విశాఖ ఘటన కలిచివేసిందని... గుండె బరువైందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో మహిళలకు భద్రత కరువైందన్నారు. దిశ యాప్ రిజిష్టర్ చేస్తే సరిపోదని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. సకాలంలో స్పందించడంలో పోలీసులు వైఫల్యం చెందారని కామెంట్స్ చేశారు. విశాఖలో మహిళలకు భద్రత పెంచాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Jyothi

Jyothi

Next Story