ఏపీలో రెండో రోజూ 108 అంబులెన్స్ సిబ్బంది సమ్మె

K V D Varma
Updated on: 25 July 2019 1:01 PM IST
ఏపీలో రెండో రోజూ 108 అంబులెన్స్ సిబ్బంది సమ్మె
X

సమస్యలను పరిష్కరించాలంటూ 108 అంబులెన్సు సిబ్బంది రెండో రోజు సమ్మెను కొనసాగించారు. పశ్చిమగోదావరి జిల్లాలో నిన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేసి వినూత్న నిరసన తెలిపారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెంతో సహా పలు చోట్ల సిబ్బంది ఆందోళనలో పాల్గొన్నారు.

ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినట్టుగా 108 అంబులెన్సులను పెంచాలని, దీంతోపాటు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ సిబ్బంది సమ్మెను కొనసాగిస్తున్నారు. సమ్మెకు మరికొందరు మద్దతు తెలపనున్నారు.


K V D Varma

K V D Varma

Next Story