ఓ అమ్మాయిని ప్రేమించాడు.. ప్రేమ విఫలమై పొరపాటున పాక్ కు వెళ్లాడు: విశాఖ కుర్రాడు ప్రశాంత్ తండ్రి

ఓ అమ్మాయిని ప్రేమించాడు.. ప్రేమ విఫలమై పొరపాటున పాక్ కు వెళ్లాడు: విశాఖ కుర్రాడు ప్రశాంత్ తండ్రి
x
Highlights

పాకిస్థాన్‌లో తెలుగువ్యక్తి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. పాస్‌పోర్టు, వీసా లేకుండా కొలిస్తాన్‌ ఎడారిలో ప్రవేశించేందుకు...

పాకిస్థాన్‌లో తెలుగువ్యక్తి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. పాస్‌పోర్టు, వీసా లేకుండా కొలిస్తాన్‌ ఎడారిలో ప్రవేశించేందుకు యత్నించారని విశాఖకు చెందిన ప్రశాంత్‌తో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇద్దరిని బహవల్పూర్ దగ్గర పాక్ పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. ప్రశాంత్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడని అతడి తండ్రి బాబూరావు చెప్పారు.

ఓ అమ్మాయిని ప్రేమించాడని, అయితే, ప్రేమ విఫలమవ్వడంతో కుంగుబాటుకు గురయ్యాడని తెలిపారు. ఈ కారణంగానే రాజస్థాన్ వెళ్లి పొరపాటున పాక్ లో అడుగుపెట్టాడని.. అంతేకాని తన కుమారుడు సంఘ వ్యతిరేక వ్యక్తి కాదని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ కూకట్ పల్లిలోని భరత్ నగర్ లో ఆరేళ్లుగా నివాసం ఉంటున్నామని చెప్పారు. రెండేళ్ల క్రితం ప్రశాంత్ ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టు ఆయన స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories