హైదరాబాద్‌ను వణికిస్తున్న వరుస భూ ప్రకంపనలు

Update: 2020-10-22 07:37 GMT

హైదరాబాద్‌ను వరుస భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. ఇప్పటికే గచ్చిబౌలి, బోరబండలో పలుమార్లు భూమి కంపించింది. ఇప్పుడు తాజాగా వనస్థలిపురం, బీఎన్‌ రెడ్డినగర్‌, వైదేహినగర్‌లో తెల్లవారుజామున భూమిలోనుంచి భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఉదయం 5 గంటల 45 నిమిషాలకు ఒకసారి, 6 గంటల 45 నిమిషాలకు రెండోసారి, 7 గంటల 8 నిమిషాలకు మూడోసారి భూమి కంపించినట్టు కాలనీవాసులు చెబుతున్నారు. వరుస భూ ప్రకంపనలతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Full View

 

Tags:    

Similar News