సినీ బాణంలా దూసుకెలుతున్న శ్రీ విష్ణు పుట్టినరోజు ఈ రోజు.

Update: 2019-08-30 05:46 GMT

ఈ మద్య కాలంలో....మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ, బ్రోచేవారెవరురా...అంటూ తనదంటూ..ఒక ప్రత్యెకతని మన తెలుగు సినిమా పరిశ్రమలో ఏర్పరచుకుంటున్న నటుడు, హీరో శ్రీ విష్ణు. ఈ రోజు శ్రీ విష్ణు పుట్టినరోజు. శ్రీ విష్ణు, బాణం మరియు సోలో లో కొన్ని చిన్న పాత్రలతో నటుడిగా పరిచయమయ్యాడు. 2013 లో ప్రేమ ఇష్క్ కాధల్ చిత్రంలో 'రొయల్ రాజు'గా, ఆ తరువాత సంవత్సరం సెకండ్ హ్యండ్ చిత్రం మరియు 2016లో అప్పట్లో ఒకడుండేవాడు తో మంచి గుర్తింపు పొందాడు.

కాలేజీలో ఆయన థియేటర్ గ్రూపు సభ్యుడు. అతను క్రికెట్ అంటే ఆశక్తి మరియు అతని యువకుడిగా ఉన్నప్పుడు అతను ఆంధ్ర ప్రదేశ్ అండర్ -19 జట్టు కొరకు ఆడాడు. ప్రస్తుతం విజయవంతమైన సినిమాలతో చాల బిజీ గా వున్నారు. ఇక మన ముందుకు "తిప్పరా మీసం" సినిమాతో రాబోతున్నారు. శ్రీ విష్ణు మరెన్నో విజయాలను అందుకోవాలని ఆశిస్తూ..పుట్టినరోజు శుభాకాంక్షలు.  

Tags:    

Similar News