Penumantra: పెనుమంట్రలో ఆర్టీసీ బస్సుపై ముగ్గురు యువకుల దౌర్జన్యం!

Penumantra: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు వద్ద తాడేపల్లిగూడెం డిపో ఆర్టీసీ బస్సుపై ముగ్గురు యువకుల దాడి. పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్.

Update: 2026-08-20 06:21 GMT

Penumantra: పెనుమంట్రలో ఆర్టీసీ బస్సుపై ముగ్గురు యువకుల దౌర్జన్యం!

Penumantra: ఆర్టీసీ బస్సును ముగ్గురు యువకులుమోటార్ సైకిల్ తో అడ్డుకొని బస్సులోకి ప్రవేశించడమే కాకుండా బస్సులోకి దౌర్జన్య ప్రవేశించి కండక్టర్ డ్రైవర్ తో పాటు ప్రయాణికులపై దాడి చేసిన సంఘటన బుధవారం మధ్యాహ్నం బ్రాహ్మణ చెరువు బస్టాండ్ సెంటర్లో జరిగింది.

తాడేపల్లిగూడెం డిపోకు చెందిన ఏపీ 37 జెడ్ 39 49 నెంబర్ గల బస్సు ఆచంట వెళ్లి తిరిగి వస్తుండగా మార్టేరు మావుళ్ళమ్మ గుడి నుంచి బ్రాహ్మణ చెరువు సెంటర్ వచ్చేవరకు మధ్య మధ్యల ముగ్గురు యువకులు బస్సుకు అడ్డు తగులుతూ వచ్చారని బ్రాహ్మణ చెరువు బస్టాండ్ లో ప్రయాణికులను దింపేందుకు నిలిపి ఉంచగా ముగ్గురు యువకులు బస్సుకు అడ్డంగా మోటార్ సైకిల్ ఉంచి బస్సులోకి ప్రవేశించి తన తో పాటు అడ్డు తగిలిన డ్రైవర్ మరియు మహిళ ప్రయాణికులపై కూడా దాడి చేశారని కండక్టర్ పి. ప్రభాకర్ రావు తెలిపారు.

దీంతో మహిళలు వారిని పట్టుకుని ప్రయత్నం చేయగా ఇద్దరు యువకులు మోటార్ సైకిల్ పై పారిపోయారని దొరికిన యువకుడ్ని తాము మహిళలు పోలీస్ స్టేషన్కు అప్పగించగా పారిపోయిన ఇద్దరు యువకుల్ని పోలీసులు స్టేషన్కు రప్పించ పోలీసులు విచారించారన్నారు. అనంతరం యువకులు తమది తప్పేనని మహిళల కాళ్లపై పడటంతో యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రుల పూసి కత్తుపై విడుదల చేసినట్లు ఎస్సై కే స్వామి తెలిపారు .

Tags:    

Similar News