Tanuku: ఘనంగా 'విశ్వాసమే విజయం' మాసపత్రిక 39 వసంతాల వేడుకలు!

Tanuku: తణుకులో NPF, యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 'విశ్వాసమే విజయం' పత్రిక 39వ వార్షికోత్సవం. సంపాదకులు ఆర్చ్‌బిషప్ ఎం. హారెత్ బాబుకు ఘన సన్మానం.

Update: 2026-08-29 14:53 GMT

Tanuku: ఘనంగా 'విశ్వాసమే విజయం' మాసపత్రిక 39 వసంతాల వేడుకలు!

Tanuku: విశ్వాసమే విజయం మాస పత్రిక 39 వసంతాల వార్షికోత్సవ వేడుకలను ఎన్పీఎఫ్, యూనైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కుడారి ఆనంద్ మాట్లాడుతూ విశ్వాసమే విజయం అనే పత్రిక తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది పాఠకులు కలిగి ఉండడం, గొప్ప విలువలు కలిగిన అంశాలు ప్రచురించడం, యవనస్తులకు, పెద్దలకు, వృద్ధులకు అవసరమైన అంశాలు ఎంతోమందికి ఆధ్యాత్మిక స్ఫూర్తినిస్తుందన్నారు.

ఎన్పీఎఫ్ జాతీయ నాయకులు రెవ. ఓ. మనోజ్ బాబ్ మాట్లాడుతూ అంతరించిపోతున్న ఈ మాస పత్రికలు వాటి విలువలను సంరక్షిస్తున్న సంపాదకులు ఆర్చిబిషప్. యం. హారెత్ బాబు అభినందిస్తూ సంపాదకులుగా అనేక అంశాలు కూర్పు చేయడం, అన్ని వయస్సుల గలవారికి పత్రిక ఉపయోగపడేటట్లు తమకున్న దశాబ్దాల అనుభవ శైలిలో అనేక పత్రికలు ప్రచురించడం అభినందనీయమన్నారు. అనంతరం మాసపత్రిక ప్రధాన సంపాదకు హా రత్ బాబును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో

యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షు, కార్యదర్శులు కె.దానియేలు, జె.ఎస్.రావు, తణుకు యునైటెడ్ పాస్టర్స్ & ప్రిచర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు పిడి ప్రసన్నకుమార్, తణుకు మండల పాస్టర్ ఫెలోషిప్ కార్యదర్శి బ్లెస్సింగ్ రాజు, సహాయ కార్యదర్శి కె.ఎస్.రాజు, ట్రెజరర్ కె.డేవిడ్ బాబు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎస్. కృపావరం, డి.టి.సి.వై నాయకులు కె.రాజేంద్ర ప్రసాద్,ప్రింటర్ సాల్మన్ రాజు, సి.హెచ్. సామ్యుల్ రాజు, అత్తిలి పాష్టర్స్ ఫెలోషిప్ కార్యదర్శి రెవ. చిరంజీవి గారు, ఇరవరం, అత్తిలి మండలం పాష్టర్స్ ఫెలోషిప్ పి.యేసు బాబు, యస్.డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News