Mahabubabad: దృష్టి మరల్చి బ్యాంకుల్లో చోరీలు.. ఏపీకి చెందిన ముగ్గురు మహిళా దొంగల

Mahabubabad: మహబూబాబాద్‌లో అంతర్రాష్ట్ర మహిళా దొంగల ముఠా గుట్టురట్టు.

Update: 2026-05-29 07:28 GMT

Mahabubabad: దృష్టి మరల్చి బ్యాంకుల్లో చోరీలు.. ఏపీకి చెందిన ముగ్గురు మహిళా దొంగల

మహబూబాబాద్: జిల్లా కేంద్రం లోని ఇండియన్ బ్యాంకు లో ఓ మహిళ ను దృష్టి మరల్చి 45 వేల రూపాయలు , ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఓ మహిళ పర్స్ నుంచి 5 వేల రూపాయల ను అపహరించిన 3 రు అంతర్ రాష్ట్ర మహిళా దొంగలను అరెస్టు చేసి 45 వేల రూపాయల ను స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో సి. ఐ రఘుపతి రెడ్డి వివరాలను వెల్లడించారు.

స్థానిక గిరిప్రసాద్ నగర్ కాలనికి చెందిన బాధితురాలు ఈ నెల 25 వ తేదీన నెహ్రు సెంటర్ లోని తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకు లో 45 వేల రూపాయల నగదు డ్రా చేసుకకుంది.అనంతరం ఇండియన్ బ్యాంకు లో గల తన మరో ఖాతాను చెక్ చేసుకోవడానికి బ్యాంకు లో

లైన్ లో నిలబడింది.4 రు మహిళలు బాధితురాలి చుట్టూ తిరుగుతూ దృష్టి మళ్ళించి ఆమె వద్ద ఉన్న నగదును అపహరించి పరారయ్యారు.ఈ నెల 23 వ తేదీన స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో ఇల్లందు బస్సు ఎక్కుతున్న మరో మహిళ పర్సులో ఉన్న 5 వేల రూపాయలను కూడా వీరు దొంగిలించినారని , బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ మరియు సాంకేతిక ఆధారాల

సహాయంతో విచారణ చేపట్టామని, ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లిగూడెం యాగర్లపల్లిపుంత గ్రామానికి చెందిన పోలమ్మ, స్నేహ, సుబ్బలక్ష్మి లను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశామని, మరొక నిందుతురాలైన వరలక్ష్మి పరారీలో ఉందని తెలిపారు. వీరిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పలు కేసులు నమోదుఅయ్యాయని, బ్యాంకులు, ఆర్టీసీ బస్టాండ్లు.

రైల్వే స్టేషన్లు రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా వెంబడిస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే 100 కి కాల్ చేయాలని , ప్రతి దుకాణదారుడు, ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సి. ఐ రఘుపతి రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకునేందుకు కృషి చేసిన టౌన్ SI లు ఉమ, వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది రుద్రయ్య , రమేశ్ చంద్ర, నాగరాజు లను మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి రావు అభినందిచారు.

Tags:    

Similar News