Mahabubabad: మహబూబాబాద్‌లో ఎంపీ వేం నరేందర్ రెడ్డికి ఘన సన్మానం

Mahabubabad: రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని మహబూబాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు.

Update: 2026-05-13 12:25 GMT

Mahabubabad: మహబూబాబాద్‌లో ఎంపీ వేం నరేందర్ రెడ్డికి ఘన సన్మానం

Mahabubabad: చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా మహబూబాబాద్ జిల్లా ను అభివృద్ధి చేస్తున్నామని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని బాలాజీ గార్డెన్స్ లో రాజ్యసభ కు నూతనంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి ని జిల్లా ప్రజా ప్రతి నిధులు ఘనంగా సన్మానించారు.ఈ సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ, కేసిఆర్ లా మోసం చేయకుండా అభివృద్ధి. సంక్షేమాన్ని రెండు కళ్ళలా చూస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

రాష్టం లో 2 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించు కుంటున్నారని, 65 లక్షల కుటుంబాలు ఉచిత విద్యుత్తు ని పొందుతున్నాయని , నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశామని, 25 లక్షల కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీని చేశామని, 1 కోటి 10 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని, 12 వేల రూపాయల రైతు భరోసాను ఇస్తున్నామని, నియోజకవర్గానికి ఒక ATC ని ( అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ ) ను ఇస్తే

మహబూబాబాద్ నియోజకవర్గానికి 2 ATC లను ఇచ్చామని గుర్తు చేశారు. మహబూబాబాద్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేస్తామని, మహబూబాబాద్ లో రైల్వే POH తో ఉద్యోగ అవకాశాలు వస్తాయని మహబూబాబాద్ రూపు రేఖలు మారిపోతాయన్నారు. మిగిలిన హామీలను కూడా అమలు చేసే విధంగా చూస్తున్నామని బరోసానిచ్చారు.

ఈ అభినందన సభ లో ఎం.పి బలరాం నాయక్, ప్రభుత్వ విప్.డాక్టర్.రామచంద్రు నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉమ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ లు జ్యోతి, సునిత, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సుధాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Tags:    

Similar News