jangaon: అవినీతి అధికారులకు శాశ్వత తొలగింపే శిక్ష తఫ్జీల్!
jangaon: తెలంగాణలో అవినీతి అధికారులపై కేవలం సస్పెండ్ చేయడం కాకుండా సర్వీస్ నుంచి శాశ్వత తొలగింపు శిక్ష అమలు చేయాలని ఆర్టీఐ ఆక్టివిస్ట్ మహ్మద్ తఫ్జీల్ డిమాండ్ చేశారు.
jangaon: అవినీతి అధికారులకు శాశ్వత తొలగింపే శిక్ష తఫ్జీల్!
jangaon: తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు అవినీతి నిరోధక శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయం. ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో పలువురు ప్రభుత్వ అధికారుల నివాసాలు, కార్యాలయాలపై ఏ సి బీ నిర్వహిస్తున్న దాడులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. అక్రమంగా కూడబెట్టిన నగదు, బంగారం, స్థిరాస్తులు, బ్యాంకు డిపాజిట్లు, బినామీ ఆస్తులు వెలుగులోకి రావడం ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి తీవ్రతను స్పష్టం చేస్తోంది.
ఈ సందర్భంగా ఆర్టీఐ ఆక్టివిస్ట్ మహ్మద్ తఫ్జీల్ మాట్లాడుతూ, కేవలం ఫిర్యాదు వచ్చిన తర్వాత మాత్రమే కాకుండా ఏ సి బీ స్వయంగా సుమోటు అనుమానాస్పద అధికారులపై నిఘా పెట్టి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కోరారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, వ్యవసాయం, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్య, పోలీసు, సంక్షేమ, విద్యుత్, వైద్య ఆరోగ్య తదితర ప్రజలకు నేరుగా సేవలందించే శాఖల్లో ప్రత్యేక విజిలెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయం, ఖర్చులు, బ్యాంకు లావాదేవీలు, స్థిరాస్తులు, బినామీ ఆస్తులు, బంగారం, పెట్టుబడులు, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించే విధానాన్ని అమలు చేయాలని అన్నారు.ప్రజల నుండి లంచాలు వసూలు చేస్తూ అక్రమ ఆస్తులు కూడబెట్టే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, వారి అక్రమ ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా, అవినీతికి పాల్పడిన అధికారులను కేవలం సస్పెండ్ చేయడం సరిపోదని, శాఖాపరమైన విచారణ, న్యాయ ప్రక్రియ పూర్తై నేరం రుజువైన సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించే విధంగా చట్టాలను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాంటి చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.
ఆర్ టీ ఐ చట్టం ద్వారా వెలుగులోకి వస్తున్న అవినీతి అంశాలపై ఏసిబీ ప్రత్యేక దృష్టి సారించి, ఫిర్యాదు కోసం వేచి చూడకుండా స్వచ్ఛందంగా విచారణలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.నిజాయితీగా విధులు నిర్వహించే అధికారులను ప్రభుత్వం ప్రోత్సహించాలి. అదే సమయంలో అవినీతికి పాల్పడే అధికారులపై రాజీ లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడుతుందని ఆర్టీఐ ఆక్టివిస్ట్ మహ్మద్ తఫ్జీల్ పేర్కొన్నారు.