Mahabubabad: కేసముద్రంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ.10 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించి, రైతులకు భూ ఆధార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.

Update: 2026-08-31 13:49 GMT

Mahabubabad: కేసముద్రంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి

మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్రం లోని ప్రతి మారు మూల ప్రాంతానికి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని రెవెన్యూ , గృహ నిర్మాణ , పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రం లో 10 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం నారాయణపురం గ్రామానికి చెందిన 780 మంది రైతులకు భూ ఆధార్ పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.....

ఇందిరమ్మ పరిపాలన కాలంలో రాష్ట్రం లో 25 లక్షల ఎకరాల భూములను పేదవారికి పంపిణీ చేశామని , వచ్చే ఎన్నికల్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్న గ్రామాలు , వార్డుల్లోనే ఓట్లు అడుగుతామన్నారు. ఈ రోజు 780 మంది రైతులకు భూ ఆధార్ పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని , భూ భారతి తోనే ఇది సాధ్యమైందని , 125 సంవత్సరాల క్రితం భూమి సర్వే చేశారని , మళ్ళీ ఇప్పుడు భూ సర్వే చేస్తున్నామని, బి.ఆర్.ఎస్ లో తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన కాలంలో రెవెన్యూ మంత్రి ఏనాడైనా ప్రజలను కలిసారా.

సాటి మంత్రులను కలిశారా అని ప్రశ్నించారు.అబద్దాలరావు మాట్లాడే మాటల గురించి మేనకోడలీ ని అడుగితే అన్నీ తెలుస్తాయన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు.ఈ కార్యక్రమం లో మంత్రి సీతక్క , రాజ్య సభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి , ఎం.పి బలరాం నాయక్ , ప్రభుత్వ విప్.రామ చంద్రు నాయక్ , ఎమ్మెల్యే లు డాక్టర్. మురళీ నాయక్, కే.ఆర్.నాగరాజు , గండ్ర.సత్యనారాయణ రావు , పలువురు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలుపాల్గొన్నారు

Tags:    

Similar News