Gudur: నర్సరీల్లో నిధుల గోల్‌మాల్ 200 నాటి.. 2,000 నాటినట్లు రికార్డులు!
Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరులో హరితహారం నిధుల దుర్వినియోగంపై గ్రామస్థుల ఆగ్రహం. TA, FA లపై అక్రమాల ఆరోపణలు, ఉన్నతాధికారుల విచారణకు డిమాండ్.
Gudur: నర్సరీల్లో నిధుల గోల్‌మాల్ 200 నాటి.. 2,000 నాటినట్లు రికార్డులు!
Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని కొన్ని గ్రామ పంచాయతీల్లో హరితహారం కార్యక్రమం అవినీతి ఆరోపణలకు నిలయంగా మారింది అని స్థానికులు ఆరోపిస్తున్నారు.పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన నర్సరీలు, మొక్కల పెంపకం పథకం కొందరు అధికారుల అక్రమ సంపాదనకు మార్గంగా మారిందని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
గ్రామాల్లో కేవలం 100 నుండి 200 మొక్కలు మాత్రమే నాటి, రికార్డుల్లో మాత్రం ఏకంగా 2,000 మొక్కలు నాటినట్లు లెక్కలు చూపిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఉపాధి హామీ పథకానికి చెందిన టెక్నికల్ అసిస్టెంట్ (TA), ఫీల్డ్ అసిస్టెంట్ (FA) లు కుమ్మక్కై నిధులను పక్కదోవ పట్టిస్తూ ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారని వారు తెలిపారు.
మొక్కల కొనుగోలు, గుంతల తవ్వకం, నీటి సరఫరా మరియు నిర్వహణ పేరుతో కాగితాల్లో పెద్ద ఎత్తున బిల్లులు డ్రా చేసుకుంటున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నాటిన మొక్కలు కనిపించడం లేదని, ఉన్న కొన్ని మొక్కలను కూడా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని తెలిపారు.
ఉన్నతాధికారులు స్పందించాలి:
హరితహారం నిధుల దుర్వినియోగంపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని, అవకతవకలకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.