Dornakal: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి రెడ్యా నాయక్

Dornakal: డోర్నకల్‌లో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి రెడ్యా నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Update: 2026-09-02 10:28 GMT

Dornakal: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి రెడ్యా నాయక్

డోర్నకల్: వెయ్యిరోజుల పాలనలో వందలాది అవినీతి కార్యకలాపాలు..., లక్షల కోట్ల అప్పులు తప్ప ప్రజలకోసం ఏం..చేసారు. సర్కార్ నడుపుతున్నారా.సర్కాస్ నడుపుతున్నరా.. డిల్లీ యాత్రలు చేసే టూరిస్ట్ సియం రేవంత్ రెడ్డి..!! నీ.. మోసాలు ప్రజలకు మొత్తం తెలిసిపోయాయి.

మీరు దిగిపోయే కాలం దగ్గర పడింది ముఖ్యమంత్రి..!! రాష్ట్రంలో ఏ..మూలకు వెల్లిన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన అంటూ ప్రజలు గొంతెత్తి నినదిస్తున్నారు.

వెయ్యి రోజుల సమయం ఇచ్చాం.‌.. ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ఎక్కడికక్కడ నిలదీస్తాం.‌., ప్రజల పక్షాన నిలిచి మీ..పని పడతాం.

డోర్నకల్ కేంద్రంలో జరిగిన బిఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పై తీవ్రవిమర్శలు చేసిన డోర్నకల్ నియోజవర్గం మాజీఎమ్మెల్యే, బిఆర్ఎస్ మాజీ మంత్రి డిఎస్ రెడ్యా నాయక్.

Tags:    

Similar News