Hanamkonda: భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి.. హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
Hanamkonda: హన్మకొండ జిల్లా పరకాల డివిజన్‌లో నేషనల్ హైవే భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశం.
Hanamkonda: భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి.. హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ: పరకాల డివిజన్ లో నేషనల్ హై వే రహదారులకు సంబందించి భూ సేకరణ మీద ఆర్డివో, తహసీల్దార్ లతో గురువారం కలెక్టరెట్ లోని మినీ కాన్ఫెరెన్స్ హల్ లో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.... రహదారుల నిర్మాణాల కోసం భూసేకరణ చేయాలిసిన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు.
పెండింగ్ ఉన్న చోట సంబంధిత రైతులతో మాట్లాడి భూ సేకరణ వేగవంతంగా జరిగేలా చూడాలన్నారు. భూ సేకరణ ప్రక్రియ పూర్తి అయిన చోట సంబంధిత వారికి పరిహారాన్ని త్వరగా చెల్లించాలన్నారు. ఈ సమావేశం లో పరకాల ఆర్డివో వెంకన్న, భూ సేకరణ విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, పరకాల డివిజన్ తహసీల్దార్ లు పాల్గొన్నారు.