Warangal: గ్రేటర్ వరంగల్ ప్రజావాణికి 72 దరఖాస్తులు టౌన్ ప్లానింగ్‌వే అధికం
Warangal: గ్రేటర్ వరంగల్ ప్రజావాణిలో 72 దరఖాస్తులు స్వీకరణ. పెండింగ్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ వెంకన్న ఆదేశం.
Warangal: గ్రేటర్ వరంగల్ ప్రజావాణికి 72 దరఖాస్తులు టౌన్ ప్లానింగ్‌వే అధికం
Warangal: ప్రజా ఫిర్యాదుల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యమని, దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా, సత్వరమే పరిష్కరించాలని బల్దియా కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు.
ప్రజలకు అందుతున్న సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే విధంగా అధికారులు పనిచేయాలని అన్నారు. గత వారం ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై విభాగాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్న కమిషనర్ పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, ప్రజలకు సత్వర సేవలు అందించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం జరిగితే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే బల్దియా ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులు
- టౌన్ ప్లానింగ్ – 27
- ఇంజినీరింగ్ – 21
- హెల్త్ అండ్ శానిటేషన్ – 09
- రెవెన్యూ – 11
- నీటి సరఫరా – 03
- హార్టికల్చర్ – 01
మొత్తం – 72 దరఖాస్తులు
ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, సూపరింటెండింగ్ ఇంజినీర్ రాజ్‌కుమార్, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్ బాబు, హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి, పన్నుల అధికారి రామకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు