Salur: సాక్షి పేపర్, వైసీపీ తీరును నిరసిస్తూ గిరిజనుల ర్యాలీ
Salur: విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లిలో ధింసా నృత్యంపై తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ సాక్షి పేపర్ ప్రతులు దహనం చేసి నిరసన తెలిపిన గిరిజనులు.
Salur: సాక్షి పేపర్, వైసీపీ తీరును నిరసిస్తూ గిరిజనుల ర్యాలీ
సాలూరు: సాలూరు మండలం మామిడిపల్లి లో గిరిజన నాయకులు సాక్షి పేపర్ కు మరియు వైసీపీ నేతలకు తీరుకు నిరసనగా ర్యాలీ చేస్తూ సాక్షి పేపర్ ని చించివేసిన గిరిజనులు.
విజయనగరం జిల్లా భోగాపురంలో ఈనెల 1వ తేదీన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో 13 వేల మంది గిరిజన బాలికలు దింసా నృత్యం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించడం అయినది. ఈ థింసా నృత్యాన్ని చూసి ప్రధాన నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రుల బృందం, అధికారుల బృందం అభినందించారని మాజీ గిరిజన సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సాలూరు మండలం మామిడిపల్లి లో మండల అధ్యక్షులు పరమేష్ ఆధ్వర్యంలో మాజీ ఐఏఎస్, సాక్షి పేపర్ మరియు వైసీపీ పార్టీ థింసా నృత్యాన్ని హేళన చేస్తూ గిరిజనుల మనోభావాలను,సాంప్రదాయాన్ని దెబ్బతీసేవిధంగా సోషల్ మీడియాలో పెట్టిన తప్పుడు ప్రచారం చేస్తూ సాక్షి పేపర్ లో ప్రసారం చేయటం బాధ కలిగించిందని గిరిజన నాయకులు తెలిపారు.
గిరిజనుల సాంప్రదాయ నృత్యాన్ని ప్రధానమంత్రికి స్వాగతం పలకటం తప్పా అని ప్రశ్నించారు. గిరిజన విద్యార్దులు, మహిళలు వారం రోజులు కష్టపడి, ప్రపంచ దేశాలు గిరిజనులు వైపు చూసే విధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చోటు సంపాదించట వైసిపి నాయకులకు మింగుడు పడటంలేదని, అందుకే ఇటువంటి చవకబారు మాటలు ఆడుతున్నారని తెలిపారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసిన సాక్షి పేపర్ ను రద్దుచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియచేస్తున్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట లక్ష్మణ, దొరలక్ష్మణ, చంద్రయ్య, కళావతి, ధర్మ తదితరులు పాల్గొన్నారు.