Parvathipuram: తీవ్ర ఉద్రిక్తత మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అరెస్ట్!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో డీఎస్సీ అక్రమాల నిరసన ఉద్రిక్తతకు దారితీయగా, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావును పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2026-08-10 07:55 GMT

Parvathipuram: తీవ్ర ఉద్రిక్తత మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అరెస్ట్!

పార్వతీపురం మన్యం జిల్లా..

డీఎస్సీ నియామక అవకతవకలపై నిరసన కార్యక్రమంలో పార్వతీపురంలో తీవ్ర ఉద్రిక్తత, మాజీ ఎమ్మెల్యే జోగారావు అరెస్టు

పార్వతీపురం:కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో భారీ ఎత్తున అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ధర్నా కార్యక్రమాలు పార్వతీపురం మన్యం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఈ ఆందోళనలో పాల్గొన్నారు.డీఎస్సీ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలపై తక్షణమే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి.అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలి.సరిహద్దులు దాటిన ఆందోళన వినూత్న నిరసనలు.మాజీ ఎమ్మెల్యే జోగారావు నేతృత్వంలో వైఎస్సార్ కూడలి వద్ద రిలే నిరాహార దీక్షలు, వినూత్న నిరసన నాటికలు నిర్వహించారు.డీఎస్సీ పోస్టులను అంగడిలో సరుకుల్లా విక్రయిస్తున్నారని, క్రీడా కోటాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం పట్టణంలో భారీ ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ర్యాలీ మరియు ధర్నాకు ముందస్తు అనుమతి లేదని పేర్కొంటూ పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులు రహదారిపై బైఠాయించి నిరసన తెలపడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనను విరమింపజేసేందుకు ప్రయత్నించగా, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు, పోలీసులకు నడుమ తీవ్ర తోపులాట జరిగింది.పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని సీతానగరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.నిరుద్యోగుల హక్కుల కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం ఆపేది లేదని, అరెస్టులతో తమ ఉద్యమాన్ని అణచివేయలేరని ఈ సందర్భంగా జోగారావు స్పష్టం చేశారు.

Tags:    

Similar News