Parvathipuram: ఏకంగా 54 డిగ్రీల ఎండలు.. పార్వతీపురం కలెక్టర్ అర్జెంట్ ఆర్డర్!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో రాబోయే ఐదు రోజులు తీవ్రమైన ఎండలు. 15 మండలాల్లో 41°C నుండి 54°C వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటూ కలెక్టర్ ప్రభాకర రెడ్డి హెచ్చరిక.
Parvathipuram: ఏకంగా 54 డిగ్రీల ఎండలు.. పార్వతీపురం కలెక్టర్ అర్జెంట్ ఆర్డర్!
Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లాలో రాబోయే ఐదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండనుందని రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) విభాగం హెచ్చరించింది. మే 15, 2026న విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్ది ఒక ప్రకటనలో అన్నారు. జిల్లాలోని 15 మండలాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41°C నుండి 54°C మధ్య నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
ప్రభావితమయ్యే మండలాలు
కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతానగరం, సాలూరు, పాచిపెంట, మక్కువ, సీతంపేట, భామిని, కొమరాడ, వీరఘట్టం, బలిజిపేట, జియ్యమ్మవలస, పార్వతీపురం, గరుగుబిల్లి మరియు పాలకొండ.
మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు, శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండటానికి తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి, వడదెబ్బ తగలకుండా గొడుగు లేదా టోపీని ధరించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు వాతావరణ శాఖ ఇచ్చే సూచనలను పాటించాలని అధికారులు కోరారు.