Seethanagaram: సీతానగరం మండలంలో వరుస చోరీల కేసు ఛేదన
Seethanagaram: పార్వతీపురం జిల్లా సీతానగరం మండలంలో వరుస చోరీల కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడి నుంచి రూ.71.40 లక్షల విలువైన 42 తులాల బంగారం స్వాధీనం.
Seethanagaram: సీతానగరం మండలంలో వరుస చోరీల కేసు ఛేదన
సీతానగరం: పార్వతీపురం జిల్లా ఎస్పీ ఆఫీసు మీడియా సమావేశం నిర్వహించిన ఎస్పీ ఎస్.వి. మాధవరెడ్డి సీతానగరం మండలంలో వరుస చోరీల కేసును ఛేదించిన పోలీసులు పాత నేరస్తుడిని అదుపులోకి తీసుకున్న పార్వతీపురం రూరల్ పోలీసులు.సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ ఆధారాలతో దర్యాప్తు దొంగతనం జరిగిన ఇంటి సమీపంలో నిందితుడి కదలికలను గుర్తించిన పోలీసులు.
సీతానగరం హనుమాన్ జంక్షన్ వద్ద నిందితుడు సువ్వాడ సతీష్ అరెస్ట్ .విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితుడు.నిందితుడి ఇంట్లో దాచిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.రెండు చోరీ కేసుల్లో సుమారు 42 తులాల బంగారం చోరీ నిందితుడి నుంచి 42 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసిన బంగారం విలువ సుమారు రూ.71.40 లక్షలు బెట్టింగ్, ఇతర చెడు వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడినట్లు పోలీసుల వెల్లడి.
టిఫిన్ షాప్‌లో పనిచేస్తూ వచ్చిన ఆదాయం సరిపోక దొంగతనాలకు పాల్పడిన నిందితుడు.రాత్రివేళ తాళం వేసి ఉన్న ఇళ్లను ఇనుప రాడ్డుతో పగులగొట్టి చోరీలు 2020లోనూ సమీప బంధువు ఇంట్లో చోరీ చేసినట్లు పోలీసుల గుర్తింపు.పోలీసుల చాకచక్యంతో భారీగా బంగారు ఆభరణాల రికవరీ.