Palakonda: పాలకొండలో మున్సిపల్ కార్మికుల భారీ ర్యాలీ మానవహారం!

Palakonda: పాలకొండలో మున్సిపల్ కార్మికుల ర్యాలీ, మానవహారం. మున్సిపల్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్.

Update: 2026-08-17 02:54 GMT

Palakonda: పాలకొండలో మున్సిపల్ కార్మికుల భారీ ర్యాలీ మానవహారం!

Palakonda: ఈరోజు నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా పాలకొండ మున్సిపల్ కార్మికులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ, మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించి హైకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, పిల్లలకు ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు అమలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం అసెంబ్లీలో చర్చ కు పెట్టి మున్సి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

లేకుంటే ప్రజలు మద్దతు పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు, యూనియన్ అధ్యక్షులు సిహెచ్ సురేష్, కార్యదర్శి సిహెచ్ సంజీవి ,కోశాధికారి పి వేణు, విమల, శ్రీదేవి ,రఘు, పి భాస్కర్ రావు తదితరులు కార్యక్రమానికి నాయకత్వం వహించారు.

Tags:    

Similar News