Parvathipuram: గిరిజన రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం: కలెక్టర్ ప్రభాకర రెడ్డి!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘అగ్రి క్లినిక్’ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ప్రారంభించారు.

Update: 2026-08-31 14:00 GMT

Parvathipuram: గిరిజన రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం: కలెక్టర్ ప్రభాకర రెడ్డి!

​పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా సమగ్ర అభివృద్ధి, గిరిజన రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించిన అగ్రి క్లినిక్ ను జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, నీటి సంరక్షణ మరియు అనుబంధ రంగాలను సమగ్రంగా అనుసంధానించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రకృతి సేద్యం, జల సంరక్షణ, డిజిటల్ వ్యవసాయం, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని విరివిగా ప్రోత్సహిస్తూ భూసారాన్ని, పర్యావరణాన్ని కాపాడుతామని పేర్కొన్నారు.

​కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ సహకారంతో పివిటిజీ (PVTG) పరిధిలోని గిరిజన గ్రామాల్లో సమగ్ర వ్యవసాయ విధానాలను అమలు చేసి, రైతులకు సరైన ఉపాధి, పంటలకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తూ వారి ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు పక్కా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇదే వేదికగా MART లో భాగంగా కొత్తగా ‘అగ్రి క్లినిక్’ను ప్రారంభించామని, దీని ద్వారా రైతులు పంట సాగు విధానాలు, సస్యరక్షణ పద్ధతులు, ప్రభుత్వ పథకాలు, ప్రకృతి సేద్యం మరియు మార్కెటింగ్ అంశాలపై సమగ్ర సేవలు పొందే అవకాశాన్ని కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భవానీ శంకర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News