Bobbili: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి!

Bobbili: బొబ్బిలిలో సీఐటీయూ ఆధ్వర్యంలో జూలై 30 'చలో కలెక్టరేట్' పోస్టర్ ఆవిష్కరణ. సమాన పనికి సమాన వేతనం, కార్మికుల క్రమబద్ధీకరణకు డిమాండ్.

Update: 2026-07-25 05:51 GMT

Bobbili: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి!

Bobbili: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కాంట్రాక్టు కార్మికుల్ని పర్మినెంట్ చేయాలి జూలై 30 చేలో కలెక్టరేట్ పోస్టర్ విడుదల సిఐటియు.!

శాశ్వత స్వభావంగాల విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులు అందర్నీ పేర్మినెంట్ చేయాలని కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 30వ తేదీ చలో కలెక్టరేట్ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు అందరూ పాల్గొవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి. శంకరరావు ఈరోజు పోస్టల్ ఆవిష్కరణలో తెలియజేశారు.

ఎవరు ఏ పేరుతో పని చేస్తున్నప్పటికీ ఒకే విధమైన విధులు నిర్వహిస్తున్నప్పుడు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని 2016 అక్టోబర్ లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. శాశ్వత స్వభావం గల విధులు నిర్వహిస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని 2026 ఏప్రిల్ లో మన రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపల్ కార్మికుల కోర్కెలను పరిష్కరించడం లేదు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని సుప్రీంకోర్టు, హైకోర్టు సూచించాయి. ఈ కోర్టు తీర్పులను అమలు చేయాలని కోరుతూ జూలై 30 శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయనగరం కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో పని బందు పెట్టి కార్మికులందరూ పాల్గొంటారని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జి. గౌరీ బి. యుగంధర్, వాసు జి‌. శంకర్రావు కార్మికులు పాల్గొన్నారు.

Tags:    

Similar News