Visakhapatnam: జీవీఎంసీ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష

Visakhapatnam: విశాఖలో జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష. ప్రతి ఇంటికి రోజుకు 135 లీటర్ల తాగునీరు, ₹1500 కోట్లతో ఎస్టీపీ ప్రాజెక్టు ప్రకటన.

Update: 2026-08-21 17:16 GMT

Visakhapatnam: జీవీఎంసీ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష

విశాఖపట్నం: జీవీఎంసీ,వీఎంఆర్‌డీఏ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ కూటమి ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

​ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని 123మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. విశాఖ నగగానికి గోదావరి నీరు వస్తోందని,ఆనీటిని నిల్వ చేసేందుకు స్థలాలను కూడా గుర్తించామని పేర్కొన్నారు.

1,000 కోట్లు వెచ్చిస్తే ప్రతి ఇంటికీ రోజుకు 135లీటర్ల చొప్పున తాగునీరు అందించవచ్చని, గోదావరి జలాలు అందుబాటులోకి వస్తే విశాఖ నీటి సమస్య దాదాపు తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డేటా సెంటర్ల వల్ల నగరంలో నీటి కొరత ఏర్పడుతుందనేది నిజం కాదని,కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే విమర్శలు చేస్తున్నారని స్పష్టం చేశారు.

నగరంలో 1,500 కోట్లతో Sewage Treatment Plant (STP) ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నామని,శుద్ధి చేసిన ఈనీటిని పరిశ్రమలకు మళ్లించడం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అత్యవసర ప్రాతిపదికన వీధి దీపాలు,రోడ్ల పనులకు ప్రాధాన్యమిస్తున్నామని, త్వరలోనే జీవో విడుదల చేసి పనులను పునఃప్రారంభిస్తామని తెలిపారు.

వేలంపేట మురికివాడ స్థానంలో 12 అంతస్తుల ఆధునిక అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నామని,అర్హులైన ఒక్కొక్కరికి 400 చదరపు అడుగుల వి విస్తీర్ణంలో ఉచిత ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చారు.జీవీఎంసీ ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం తీర్పు వెలువడిన అనంతరం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు.

Tags:    

Similar News