Visakhapatnam: గాజువాకలో స్పా ముసుగులో వ్యభిచారం!

Visakhapatnam: విశాఖ గాజువాకలోని మైయామి స్పాపై పోలీసుల దాడి. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులు రింకు రాయ్, లక్ష్మణ్‌లతో పాటు పలువురు అదుపులోకి.

Update: 2026-08-31 06:14 GMT

Visakhapatnam: గాజువాకలో స్పా ముసుగులో వ్యభిచారం!

Visakhapatnam: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న MIAMI Spaపై పోలీసుల దాడి... MIAMI Ayurvedic & Thai Spa పై పోలీసులు తనిఖీ చేయగా, స్పా ముసుగులో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

వివిధ గదుల్లో మహిళలు మరియు విటులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. స్పా నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్న రింకు రాయ్ మరియు లక్ష్మణ్ మహిళలకు అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశ చూపి వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

ఈ దాడిలో SIలు, మహిళా పోలీసు సిబ్బంది మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, స్పా నిర్వహకులు మరియు ఇతర సంబంధిత వ్యక్తులపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు గాజువాక పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News