Visakhapatnam: గంజాయి సాగు చేస్తున్న ప్రధాన నిందితుడు అరెస్ట్: భీమిలి పోలీసులు!
Visakhapatnam: విశాఖ జిల్లాలో గంజాయి సరఫరా చేస్తున్న ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు చెందిన ప్రధాన సాగుదారుడు సుశీల్ మనహిరాను భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు.
Visakhapatnam: గంజాయి సాగు చేస్తున్న ప్రధాన నిందితుడు అరెస్ట్: భీమిలి పోలీసులు!
విశాఖపట్నం: గౌరవనీయులైన విశాఖపట్నం సిటీ పోలీస్ కమీషనర్ శ్రీ శంకబ్రత బగ్చి IPS గారి ఆదేశాల మేరకు భీమిలి సి.ఐ శ్రీ దివాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో NDPS కేసులో కీలక పురోగతి సాధించారు.
అరెస్ట్ చేసిన ప్రధాన ముద్దాయి వివరాలు:
షుషీల్ మనహిరా @ కుమికేలా దాస్ @ సుశీల్ మిస్త్రీ, తండ్రి మకరంద మనహిరా, వయస్సు 46 సంవత్సరాలు, కులం - జాదబ్, నివాసం కుంబారి గ్రామం, బలంగీర్ జిల్లా, ఒడిశా రాష్ట్రం.
కేసు నేపథ్యం:
ఈ నెలలో ఆనందపురం మండలంలోని ప్లైవుడ్ కంపెనీలో పని చేస్తున్న వారి వద్ద నుండి గంజాయిని పట్టుకున్న భీమిలి పోలీసులు వారిని అరెస్ట్ చేసి లోతుగా విచారించారు. వారి నుండి Backward Link రాబట్టి, సమాచారం ఆధారంగా పోలీసు బృందం ఒడిశా-ఛత్తీస్‌ఘడ్ బోర్డర్ కు వెళ్లి గంజాయి సాగు చేస్తున్న ఈ ప్రధాన ముద్దాయిని పట్టుకొని అరెస్ట్ చేశారు.
మోడస్ ఆపరెండి:
ఈ గ్యాంగ్ భీమిలి మరియు ఆనందపురం మండలాల్లోని యువతకు, కంపెనీ వర్కర్లకు చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయిని పెట్టి డబ్బులకు విక్రయిస్తున్నారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని, గంజాయి సాగు, రవాణా, విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని సి.ఐ గారు హెచ్చరించారు.