Anakapalli: చోడవరంలో నీట్ విద్యార్థి అదృశ్యం కేసు నమోదు!

Anakapalli: అనకాపల్లి జిల్లా చోడవరంలో నీట్ పరీక్ష రాసిన 19 ఏళ్ల యువకుడు పైల నిహార్ నాయుడు అదృశ్యమయ్యాడు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 4 Sept 2026 3:47 PM IST
Anakapalli
X

Anakapalli: చోడవరంలో నీట్ విద్యార్థి అదృశ్యం కేసు నమోదు!

Anakapalli: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గాంధీ గ్రామం, విద్యానగర్ కాలనీకి చెందిన తన కుమారుడు పైల నిహార్ నాయుడు వయస్సు 19 సంవత్సరాలు అదృశ్యమైనట్లు పైల లక్ష్మి,చోడవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె కుమారుడు నిహార్ నాయుడు ఇంటర్మీడియట్ పూర్తి చేసి NEET పరీక్ష రాశాడు. పరీక్షలో వచ్చిన మార్కుల విషయమై అతని తండ్రి తరచుగా మందలించేవాడని తెలిపారు.

02.09.2026 తేదీన మధ్యాహ్నం సుమారు 12:45 గంటలకు నిహార్ నాయుడు ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతని కోసం పరిసర గ్రామాలు మరియు తెలిసిన ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు.

దీంతో పైల లక్ష్మి 03.09.2026 తేదీన మధ్యాహ్నం 12:00 గంటలకు చోడవరం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయగా, పోలీసులు అదృశ్యం కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

అదృశ్యమైన యువకుడి వివరాలు:

పేరు: పైల నిహార్ నాయుడు

వయస్సు: 19 సంవత్సరాలు

తండ్రి పేరు: హరి నారాయణ

కులం: కె.వెలమ

చిరునామా: విద్యానగర్ కాలనీ, గాంధీ గ్రామం, చోడవరం గ్రామం, చోడవరం మండలం, అనకాపల్లి జిల్లా.

ఆచూకీ తెలిసిన వారు Chodavaram పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని చోడవరం పోలీసులు కోరుతున్నారు.

CI, Chodavaram, cell:: 9440796090,

SI, Chodavaram :: 8142936937

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story