Marikavalasa: మారికవలస బాలుర పాఠశాల సాధన ఫలించిన ఆదివాసీల సుదీర్ఘ పోరాటం
Marikavalasa: మారికవలస ఇంగ్లీష్ మీడియం బాలుర పాఠశాలను కొనసాగించేందుకు ITDA PO, SP అంగీకారం. విద్యార్థులు, ఆదివాసీ సంఘాల సుదీర్ఘ పోరాటానికి లభించిన విజయం.
Marikavalasa: మారికవలస బాలుర పాఠశాల సాధన ఫలించిన ఆదివాసీల సుదీర్ఘ పోరాటం
Marikavalasa: మారికవలసలోని ఏకైక ఇంగ్లీష్ మీడియం బాలుర పాఠశాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఆదివాసీ సంఘాలు చేపట్టిన పోరాటం ఫలించింది. ధర్నా శిబిరంలోనే ఐటీడీఏ పీఓ, జిల్లా ఎస్పీ పాఠశాలను కొనసాగిస్తామని ప్రకటించారు. దీంతో తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందిన తల్లిదండ్రుల్లో ఆనందం నెలకొంది.
రాత్రి 12 గంటల సమయంలో జెండాలు ఊపుతూ పాఠశాల బస్సును పంపించిన దృశ్యాలు.. ఈ పోరాటం వెనుక ఉన్న భావోద్వేగాన్ని చాటిచెప్పాయి.
పి. అప్పల నరస, కూడ రాధాకృష్ణతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ఈ పోరాటంలో కీలకంగా నిలిచారు. అయితే ఇది కేవలం ఆదివాసీ విద్యార్థుల విజయం మాత్రమే కాదు, న్యాయం కోసం చేసే ప్రతి నిజాయితీ పోరాటానికి దక్కిన గౌరవంగా చూడాల్సిన విజయం.
పోరాటం చేస్తే పోయేదేముంది. బానిస సంకెళ్లు తప్ప అని పెద్దలు చెప్పిన మాటలకు ఇది ఒక నిలువెత్తు తార్కాణం.
అధికారం ముందు సామాన్యుడి గొంతు చిన్నదిగా కనిపించవచ్చు, కానీ ఆ గొంతులు ఒక్కటైనప్పుడు వాటిని విస్మరించడం అంత సులభం కాదు.
ఒక సమస్య నిజమైనదైతే, ఒక డిమాండ్ న్యాయమైనదైతే, ప్రజల పోరాటం నిజాయితీగా ఉంటే, ఆ పోరాటానికి విలువ ఉంటుంది. ఆ ఐక్యతకు బలం ఉంటుంది, ఆ గొంతుకు ఫలితం ఉంటుంది.
మారికవలస పాఠశాల కోసం జరిగిన ఈ పోరాటం రేపు ఏ సమస్య ఎదురైనా న్యాయం కోసం శాంతియుతంగా, ఐక్యంగా పోరాడితే మార్పు సాధ్యమే అనే నమ్మకాన్ని కలిగించే ఒక మంచి ఉదాహరణ. పిల్లల చదువు కోసం మొదలైన పోరాటం.. చివరికి వారి భవిష్యత్తును కాపాడే నిర్ణయానికి దారితీసింది.
పోరాడి సాధించిన విజయంలోని కిక్కే వేరు.