Visakhapatnam: బ్రాహ్మణులకు అలర్ట్ జనగణనలో కోడ్ 126 నమోదు మర్చిపోవద్దు

Visakhapatnam: జనగణన మరియు కులగణనలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి 'కోడ్ నెం. 126' కేటాయించినట్లు బ్రాహ్మణ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ వడ్డాది ఉదయకుమార్ తెలిపారు.

Update: 2026-05-02 12:05 GMT

Visakhapatnam: బ్రాహ్మణులకు అలర్ట్ జనగణనలో కోడ్ 126 నమోదు మర్చిపోవద్దు

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ వడ్డాది ఉదయకుమార్ జనగణన ప్రక్రియ దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యింది. కుల ఆధారిత జనగణనలో 215 విభిన్న కులాలు ఉన్నాయని వాటిలో "బ్రాహ్మణ" కులానికి ప్రత్యేకంగా "కోడ్ నెం.126" కేటాయించబడింది. అందువల్ల, జనగణన నిర్వహించడానికి ప్రభుత్వ అధికారి మీ ఇంటికి వచ్చినప్పుడు వారికి పూర్తి వివరాలు తెలియచేసి మన కులాన్ని ప్రత్యేకంగా ఇచ్చిన కోడ్ నెం.126 (బ్రాహ్మణ) కింద నమోదు చేశారా లేదా అన్న విషయాన్ని కచ్చితంగా నిర్ధారించుకోవాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ వడ్డాది ఉదయకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈనెల 31 వ తేదీ వరకు జనగణనతో పాటు కులగణణ కూడా జరుగుతుందని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఈ విషయాన్ని బ్రాహ్మణుల అందరికీ తెలియజేయాలని ట్రస్ట్ చైర్మన్ వడ్డాది ఉదయకుమార్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags:    

Similar News