Off The Record: కూటమికి అడ్డంగా దొరికిన వైసీపీ
Off The Record: యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అరెస్ట్ వ్యవహారంతో ఏపీలో ముదిరిన రాజకీయాలు. రావణ్‌కు తమకు సంబంధం లేదన్న పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై అధికార కూటమి ఎదురుదాడి.
Off The Record: కూటమికి అడ్డంగా దొరికిన వైసీపీ
Off The Record: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రశ్న రావణ్ వ్యవహారం రోజుకో రాజకీయ మలుపు తిరుగుతూ పొలిటికల్ హిట్ ను పెంచుతోంది...యూట్యూబర్ రావణ్ చేసిన వ్యాఖ్యలు,నమోదైన కేసులు, అరెస్టు, రిమాండ్ వ్యవహారం ఒక ఎత్తు కాగా.. రాజకీయ పార్టీల ఎంట్రీతో సీన్ చేంజ్ అయ్యి కంప్లీట్ గా పొలిటికల్ హిట్ ను ప్రొడ్యూస్ చేస్తోంది.
ముఖ్యంగా ఈ అంశంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ముదురుతున్న మాటల యుద్ధంతో కమ్యూనల్ పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. వైసీపీ వైఖరిపై అధికార కూటమి విమర్శలతో విరుచుకుపడుతుంటే, జరుగుతున్న తాజా పరిణామాలపై వివరణ ఇచ్చుకోవలసిన పరిస్తితికి వచ్చారు వైసీపీ నేతలు...
ప్రశ్న రావణ్ ను కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది? అక్రమ అరెస్టు చేసింది? కక్ష సాధింపు చేపడుతోంది? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం? నిన్న మొన్నటి వరకు కొందరు వైసిపి నేతలు చేసిన వ్యాఖ్యలు ఇవి... కానీ వైసీపీలో కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం రావన్ కు తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పడంతో ఒక్కసారి రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చగా మారింది.
అసలు రావణ్ విషయంలో ఏం జరిగింది..? ఈ వ్యవహారంలో ముందుగా ఆచితూచి వ్యవహరించిన వైసీపీ తర్వాత సంబంధం లేదని చెప్పటం వెనుక ఉన్న మర్మం ఏమిటి? వైసిపిపై అధికార కూటమి సభ్యులు చేస్తున్న విమర్శలు ఏమిటి? పొలిటికల్ హీట్ పెరగడానికి కారణమైన ఆ వ్యాఖ్యలు ఏమిటి? ఈ అంశమే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలతో పాటు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనియాంశంగా మారింది.