Burning Topic: ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన అమెరికా సుప్రీంకోర్టు
Burning Topic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష సైనిక అధికారాలకు యూఎస్ సెనెట్ గండికొట్టింది.
Burning Topic: ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన అమెరికా సుప్రీంకోర్టు
Burning Topic: అమెరికా సెనెట్ డొనాల్డ్ ట్రంప్ యుద్ధ అధికారాలను చెక్ పెడుతూ పెద్ద షాకే ఇచ్చింది. ఇరాన్‌తో యుద్ధానికి కాంగ్రెస్ ముందస్తు అనుమతి లేకుండా దళాలను పంపడాన్ని నిరోధించడంతో పాటు అక్కడి నుంచి బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించేలా తీర్మానాన్ని ఆమోదించింది.
దీనికి అనుకూలంగా 50 ఓట్లు, వ్యతిరేకంగా 48 ఓట్లు వచ్చాయి. సొంత పార్టీకి చెంది నలుగురు సెనెట్ సభ్యులు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేయడం అమెరికా అధ్యక్షుడిని కలవర పెట్టింది. వారికి దేశ భక్తి లేదని, ప్రచారం కోసం ఆరాటపడేవారు అంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ తీర్మానంతో ఒరిగేదేమీ లేదంటోంది వైట్‌హౌస్.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష సైనిక అధికారాలకు చెక్ పెట్టేలా అమెరికా సెనెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌తో యుద్ధానికి కాంగ్రెస్ ముందస్తు అనుమతి లేకుండా అమెరికా దళాలను పంపడాన్ని నిరోధించడంతో పాటు అక్కడి నుంచి యూఎస్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించేలా తీర్మానాన్ని ఆమోదించింది.
విపక్ష డెమొక్రాట్లు ప్రవేశ పెట్టిన ఈ తీర్మానం విషయంలో ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీకి చెందిన కొందరు సీనియర్ సభ్యులు కూడా చేతులు కలపడం విశేషం. పశ్చిమాసియాలో ఇరాన్ మీద ట్రంప్ ఏకపక్షంగా యుద్ధం చేపట్టారనే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ అమెరికా కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం కలకలం రేపుతోంది. తీర్మానంపై చర్చ సందర్భంగా డెమొక్రాట్ పార్టీ సీనియర్ సభ్యుడు చక్ షూమర్ మట్లాడుతూ ట్రంప్ ప్రభుత్వ విధానాలు అమెరికాను ప్రమాదకరమైన యుద్ధాల వైపు నడిపిస్తున్నాయని ఆరోపించారు
అమెరికా సెనెట్‌లో ఈ తీర్మానానికి అనుకూలంగా 50 ఓట్లు, వ్యతిరేకంగా 48 ఓట్లు వచ్చాయి. దీంతో అధ్యక్షుని దూకుడుకు కళ్లెం పడింది. సెనెట్‌లో ట్రంప్ పార్టీ రిపబ్లికన్లకు మెజారిటీ ఉన్నా ఫలితం లేకపోయింది. ఆ పార్టీకి చెందిన నలుగురు రిపబ్లికన్ సెనేటర్లు రాండ్ పాల్, సుసాన్ కాలిన్స్, లిసా ముర్కోవ్‌స్కీ, బిల్ కాసిడీ అధ్యక్షునికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు.
మరోవైపు డెమొక్రాటిక్ పార్టీకి చెందిన సీనియర్ సెనేటర్ జాన్ ఫెటర్మన్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్‌కు అనుకూలంగా ఓటు వేయడం విశేషం. గతంలో ఇలాంటి యుద్ధ అధికారాల పరిమితి తీర్మానాలను తీవ్రంగా వ్యతిరేకించిన రిపబ్లికన్ పక్ష నేత మిచ్ మెక్‌కానెల్, డేవ్ మెక్‌కార్మిక్‌లు ఓటింగ్‌కు హాజరుకాకపోవడం డెమొక్రాట్లకు కలిసివచ్చింది. సెనెట్‌లో ప్రవేశపెట్టడానికి ముందే ఈ తీర్మానం అమెరికా దిగువ సభ అయిన 'హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్'లో 215–208 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది.
ఈ ఏడాది ఆరంభం నుంచి ఇరాన్‌కు సంబంధించిన యుద్ధ అధికారాలపై సెనేట్ ఇప్పటికే 10 సార్లు ఓటింగ్ నిర్వహించింది. గత నెలలో సెనేట్ మద్దతు పొందిన మరో ప్రతిపాదన ముందుకు వెళ్లినా, తుది ఓటింగ్ ఇంకా జరగలేదు. ఆమోదానికి అవసరమైన మద్దతు సమకూర్చేందుకు డెమొక్రటిక్ చట్టసభ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు కొనసాగుతున్నా,
భవిష్యత్తులో ఇరాన్‌కు సంబంధించిన ఏ సైనిక చర్య జరిగినా కాంగ్రెస్ పర్యవేక్షణ ఉండాలని కొందరు డెమొక్రటిక్ సెనేటర్లు పట్టుబడుతున్నారు. కాగా సెనెట్‌లో సొంత పార్టీ వారే తన నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందిస్తూ, ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చిన వారిని తీవ్ర పదజాలంతో దూషించారు. వారిని ప్రచారం కోసం ఆరాటపడేవారుగా అభివర్ణించారు. ఇలా చర్యలకు దేశభక్తి లేనివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా అధ్యక్షుని యుద్ధ అధికారాలకు కత్తెర వేస్తూ అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయ సభల్లో తీర్మానం ఆమోదం పొందినా దీనికి సాంకేతికంగా చట్టబద్దత ఉండదని వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు మీడియాతో చెప్పారు. 'ఈ ఉమ్మడి తీర్మానాలు అధ్యక్షుడి వద్దకు వెళ్లవు. వీటికి చట్టబద్ధత ఉండదు. కొందరు రిపబ్లికన్ సెనేటర్లు హాజరుకాకపోవడం వల్లే ఈ తీర్మానం నెగ్గింది తప్ప దీనికి పెద్ద ప్రాధాన్యత లేదు. పైగా, ఏప్రిల్ 7న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతోనే ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం ముగిసింది.
ప్రస్తుతం అక్కడ అమెరికా సైన్యం ఎలాంటి ప్రత్యక్ష యుద్ధంలోనూ లేదు. అందువల్ల అక్కడ నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలనడం అర్థరహితం' అని తెలిపారు. అయితే ఈ ప్రకటననుడెమొక్రాట్స్ తప్పుబట్టారు. 1973 నాటి 'వార్ పవర్స్ యాక్ట్' ప్రకారం కాంగ్రెస్ ఉమ్మడి తీర్మానం ద్వారా ఆదేశిస్తే అధ్యక్షుడు సైన్యాన్ని వెనక్కి పిలవాల్సిందేనని స్పష్టం చేశాయి.. ఇది కచ్చితంగా అధ్యక్షుడిని కట్టడి చేస్తుందని హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ పేర్కొంది.
మరోవైపు ఇరాన్‌తో అమెరికా చేసిన యుద్ధానికి సంబంధించిన ఖర్చులను భరించడానికి తమకు సుమారు 80 బిలియన్ డాలర్లు అవసరమని కాంగ్రెస్‌కు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ తెలిపింది. రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ క్యాపిటల్ హిల్‌లోని చట్టసభ సభ్యులతో సంప్రదింపులు జరిపారు. ఉప రక్షణ కార్యదర్శి స్టీఫెన్ ఫెయిన్‌బర్గ్ గత వారం ప్రతిపాదిత నిధుల ప్యాకేజీపై సెనేటర్లకు వివరించారు. ఈ మేరకు ఈ విషయం గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు తెలిపారు.
కాగా, 2027కు సంబంధించి అమెరికా రక్షణ బడ్జెట్‌ను ఏకంగా 50శాతం పెంచేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 1.5 ట్రిలియన్ డాలర్లు మేర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఈ తరుణంలోనే పెంటగాన్ నుంచి కాంగ్రెస్ ఈ నిధుల అభ్యర్థన వచ్చింది.యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ ఇరాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై అమెరికా చట్టసభ సభ్యులు సందేహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో 80 బిలియన్ డాలర్ల తమకు కేటాయించాలని కాంగ్రెస్‌ను కోరడం గమనార్హం.
ఇదిలా ఉంటే అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న కీలకమైన శాంతి చర్చల్లో పాకిస్తాన్, ఖతార్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరించడంపై రిపబ్లికన్ సెనేటర్లు రిక్ స్కాట్, టిమ్ షీహీ మండిపడ్డారు. ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇస్తూ, వారికి ఆశ్రయం కల్పించే దేశాలను నమ్మి చర్చలు జరపడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాపై దాడి చేసిన అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్థాన్ దశాబ్దం పాటు ఆశ్రయం కల్పించిందని గుర్తు చేశారు.
ఈ దేశాలు శాంతి స్థాపన కంటే ఇరాన్ సాగిస్తున్న ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయని ధ్వజమెత్తారు. అమెరికాకు అసలైన అసలైన మిత్రులు ఎవరో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సెనేటర్ రిక్ స్కాట్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకున్నప్పటికీ ఆ దేశం అణ్వాయుధం తయారు చేయకుండా అడ్డుకునే అవకాశాలు ఏమాత్రం లేవని కుండబద్దలు కొట్టారాయన.
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్థాన్ పదేళ్లపాటు ఆశ్రయం కల్పించిందనే నిజాన్ని ఎవరూ మరువలేరని సెనేటర్ టిమ్ షీహీ గుర్తుచేశారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ద్వారా అమెరికాకు వ్యతిరేకంగా పనిచేసే తిరుగుబాటుదారులకు నిధులు అందించారని, ఇరాన్ నాయకత్వానికి మద్దతుగా నిలిచారని ఆరోపించారు. అలాంటి దేశాలు ఈ చర్చల్లో నిష్పక్షపాతంగా మధ్యవర్తిత్వం వహిస్తాయని అనుకోవడం ముమ్మాటికీ తప్పేనని ఆయన తేల్చిచెప్పారు. అమెరికా తన సంప్రదాయ మిత్రదేశాలైన యూఏఈ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలను కూడా చర్చల్లో భాగస్వామ్యం చేయాలన్నారు.
ఇటీవల స్విట్జర్లాండ్‌లో ఇరాన్‌తో జరుగుతున్న చర్చల సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్ పాకిస్థాన్ అంటే ఇష్టమని పేర్కొన్నారు. అంతేకాక పాక్ ఆర్మీ చీఫ్ఆసీం మునీర్ తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో ఒకరని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సొంత రిపబ్లికన్ పార్టీ నాయకునే ట్రంప్ ప్రభుత్వ విధానాల్ని తప్పుట్టారు.